Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeసినిమాఈ 'వీరాభిమాని' ఎవరు?

ఈ ‘వీరాభిమాని’ ఎవరు?

- Advertisement -

సినీ జర్నలిస్ట్‌, నిర్మాత సురేష్‌ కొండేటి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వీరాభిమాని’.
ది డిజైర్‌ ఆఫ్‌ ఏ ఫ్యాన్‌ (ఓ అభిమాని కోరిక) అనేది ఈ చిత్ర ట్యాగ్‌లైన్‌. రాంబాబు దోమకొండ దర్శకుడు. ఎస్‌కే.రెహ్మాన్‌, కంద సాంబశివరావు నిర్మాతలు.
ఈ సినిమా ఈ నెల 22న చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవు తోంది. మంగళవారం ఈ చిత్ర ప్రీమియర్‌ షోను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్‌ రాంబాబు మాట్లాడుతూ, ‘ఏపీ, తెలంగాణలో మెగాభిమానుల కోసం 70 థియేటర్స్‌లో ఉచితంగా మా సినిమాను చూపించబోతున్నాం’ అని తెలిపారు. హీరో సురేష్‌ కొండేటి మాట్లాడుతూ, ‘చిరంజీవి నాకు దేవుడితో సమానం. ఈ చిత్రంలో నటించడం దేవుడి వరంగా భావిస్తున్నాను. ఇప్పటికే నాలుగైదు షోస్‌ వేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మెగాస్టార్‌ మీద నా అభిమానాన్ని ఈ చిత్రంతో తెలియజేస్తున్నట్లు భావిస్తున్నా’ అని అన్నారు.
‘మా దేవుడు చిరంజీవిపై సినిమా చేయటం ఆనందంగా ఉంది. ఆయన కోసం మరిన్ని సినిమాలు చేస్తాం. అలాగే ప్రతి ఊరిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం’ అని నిర్మాత ఎస్‌కే రెహ్మాన్‌ చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad