Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'లవ్‌ యూ.. రా'రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘లవ్‌ యూ.. రా’రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

సముద్రాల సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై చిన్ను హీరోగా, గీతికా రతన్‌ హీరోయిన్‌గా రానున్న చిత్రం ‘లవ్‌ యూ రా’. ప్రసాద్‌ ఏలూరి దర్శకుడు. సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్‌ ప్రజాపతి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన ఈవెంట్‌లో ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్‌ బేబీ’, ‘యూత్‌ అబ్బా మేము’, ‘దైవాన్నే అడగాలా’ అనే పాటలను లాంచ్‌ చేశారు.
హీరో చిన్ను మాట్లాడుతూ ‘ఈ సినిమా ఆద్యంతం అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. ఇందులో హర్రర్‌, కామెడీ, లవ్‌ ఇలా అన్ని అంశాలుంటాయి’ అని తెలిపారు. ‘సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. అందుకే ఈ మూవీతో అసోసియేట్‌ అయ్యాను. ఎక్కడా కూడా కొత్త వాళ్లు ఈ మూవీని చేసినట్టుగా అనిపించదు’ అని నిర్మాత శ్రీనాథ్‌ ప్రజాపతి చెప్పారు. దర్శకుడు ప్రసాద్‌ ఏలూరి మాట్లాడుతూ, ‘మా మూవీని చూసి మెచ్చుకున్న డిస్ట్రిబ్యూటర్‌ దయానంద్‌కి థ్యాంక్స్‌’ అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad