కడారి నాగరాజు సీపీఐ(ఎం) పసర గ్రామ కమిటీ అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట : పెనుగాలులకు ఇటీవల ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) పసర గ్రామ కమిటీ అధ్యక్షుడు కడారి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పసర గ్రామంలో సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నాగరాజు మాట్లాడారు. మండల వ్యాప్తంగా 76 గృహాలు వర్షాలకు పూర్తిస్థాయిలో ధ్వంసం అయినట్లు మండల రెవెన్యూ యంత్రాంగం గుర్తించి సర్వే చేసి తాత్కాలిక సహాయం అందించడం జరిగిందని అన్నారు. 76 మందిలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం కేటాయించకపోవడం దురదృష్టకరమనీ అన్నారు. ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ఖరీదు చేయాలని అన్నారు. గత నెల రోజుల వ్యవధిలో వరుసగా 4 సార్లు వర్షం కురవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న ఆలస్యానికి ఒక రైతు ఇటీవల ఆత్మహత్య ప్రయత్నం కూడా మండల కేంద్రంలో చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము యంత్రాంగం స్పందించి ధాన్యం ఖరీదును త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు చిట్టిబాబు ఆదిరెడ్డి నాగరాజు సూర్యనారాయణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ గృహాలు నిర్మించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES