Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంతిరిగి నేరాలు చేస్తే తాటతీస్తాం..

తిరిగి నేరాలు చేస్తే తాటతీస్తాం..

- Advertisement -

10 పోలీస్‌స్టేషన్లలో కేసులు

– 11గ్యాంగ్‌లు.. 101 మందిని విచారించిన సీపీ
– అడిషనల్‌ డిస్ట్రిక్‌ మెజిస్ట్రేట్‌ హౌదాలో ఎగ్జిక్యూటీవ్‌ కోర్టు నిర్వహణ


నవతెలంగాణ – సిటీబ్యూరో
”ప్రతి నేరస్థుని కదళికలపై ప్రత్యేక నిఘా ఉంచాం.. తిరిగి నేరాలకు పాల్పడితే తాటతీస్తాం..” అంటూ హైదరాబాద్‌ సీపీ, డీజీ సివి.ఆనంద్‌ హెచ్చరించారు. శాంతిభద్రలకు విఘాతం కల్గిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం అడిషనల్‌ డిస్ట్రిక్‌ మెజిస్ట్రేట్‌ హౌదాలో ‘ఎగ్జిక్యూటీవ్‌ కోర్టు’ను నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కమిషనరేట్‌ పరిధిలోని సౌత్‌, సౌత్‌ఈస్ట్‌, సౌత్‌వెస్ట్‌ జోన్‌ పరిధుల్లోని 10 పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించారు. 11గ్యాంగ్‌లకు సంబంధించిన నేరచరిత్రపై దృష్టిసారించారు. క్రిమినల్‌ గ్యాంగ్‌ల మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు, రౌడీషీటర్ల ఆగడాలు, నిందితుల వసూళ్లు, దౌర్జన్యాలపై ఆరా తీశారు. క్రిమినల్‌ రికార్డుల ప్రకారం నగరంలో 101 మందిని విడివిడిగా విచారించారు. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దౌర్జనాలకు పాల్పడుతున్న నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 గ్యాంగ్‌ల్లోని ఆరు గ్యాంగ్‌ల సభ్యులు ఎలాంటి నేరాలకూ పాల్పడలేదని తేలింది. వారిని కుటుంబసభ్యుల సమక్షంలో విచారించిన సీపీ శాంతియుతంగా ఉండాలని, తిరిగి నేరాలకు పాల్పడొద్దని సూచించారు. మరికొందరు భవిష్యత్‌లో శాంతియుతంగా ఉంటామని సీపీకి హామీనిచ్చారు. గణేష్‌ ఉత్సవాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారికి దిశారిర్ధేశం చేశారు. ఎవరైనా తిరిగి నేరాలకు పాల్పడితే బీఎన్‌ఎస్‌ఎస్‌ 2023లోని సెక్షన్‌ 126 ప్రకారం బాండ్‌ రాయించుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీ కె.అపూర్వారావు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad