Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమేడారం జాతరకు రూ.150 కోట్లు మంజూరు

మేడారం జాతరకు రూ.150 కోట్లు మంజూరు

- Advertisement -

– ఉత్తర్వులు జారీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ
– కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డాక్టర్‌ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళాగా పిలిచే ఈ మహౌత్సవం విజయవంతంగా సాగేందుకు, మేడారం లో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్‌, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌ కుమార్‌లకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ (సీతక్క) కృతజ్ఞతలు తెలిపారు. ”ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆదివాసీల గౌరవానికి ప్రతీక. మేడారం మహా జాతర కోసం రూ. 150 కోట్లు మంజూరు చేయడం, ఆదివాసీ గిరిజనుల పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి, ప్రజా ప్రభుత్వం చిత్తశుద్దికి నిదర్శనం. ఈ సారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరుగనుంది” అని పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad