ప్రత్యేక సమ్మరీ రివిజన్‌కు షెడ్యూల్ విడుదల : హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్
నవతెలంగాణ – సిటీబ్యూరో
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం భారత ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల కమిషన్ సూచించిన స్పెషల్ సమ్మరీ రివిజన్‌ను వివరించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమం సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు నిర్వహించనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జులై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు తప్పని సరిగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 2 నుంచి17 వరకు క్లెయిమ్స్ అండ్ అభ్యంతరాలకు అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్ 25 వరకు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ డిస్పోజల్ చేస్తామన్నారు. సెప్టెంబర్ 30 వరకు ఓటరు జాబితా ఫైనల్ ప్రకటిస్తామని చేస్తామని కమిషనర్ వివరించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో రాజకీయ ప్రతినిధులు సహకరించి విజయవంతం చేయాలన్నారు. వివిధ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా సూచనలు స్వీకరించి సమగ్ర ఓటరు జాబితా తయారు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ ప్రతినిధులు మర్రి శశిధర్‌రెడ్డి, కొల్లూరి ప్రవీణ్ కుమార్, పి.వెంకటరమణ, కె.సందేశ్ కుమార్ (బహుజన సమాజ్ పార్టీ), మల్లంగి విజరు (ఆమ్ ఆద్మీ పార్టీ), ఎం.శ్రీనివాసరావు (సీపీఐ(ఎం)), కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేష్ కుమార్, మహ్మద్ వాజిద్ హుస్సేన్, ప్రశాంత్ రాజుయాదవ్ (తెలుగుదేశం పార్టీ), సయ్యద్ ముస్తాక్(ఎంఐఎం) తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES