Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంయూరియా కోసం రైతులతో పోలీసుల కాళ్లు మొక్కిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

యూరియా కోసం రైతులతో పోలీసుల కాళ్లు మొక్కిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

-ఎమ్మెల్యే హరీశ్‌రావు

నవతెలంగాణ – నంగునూరు
మాజీ సీఎం కేసీఆర్‌ గోదావరి జలాలతో రైతుల పాదాలు కడిగితే.. ఈ సీఎం రేవంత్‌రెడ్డి యూరియా కోసం రైతులతోనే పోలీసుల కాళ్లు మొక్కిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. సద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బుధవారం మహిళాశక్తి స్వగృహ భోజనశాల, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు ఆనగోని లింగంగౌడ్‌ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. 51 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డికి యూరియా ఇచ్చే తెలివి.. ముందుచూపు లేదని విమర్శించారు. అందాల పోటీలపై పెట్టిన శ్రద్ధ, యూరియా సరఫరాలో లేదన్నారు. యూరియా ఇవ్వని కాంగ్రెస్‌ నాయకులకు గ్రామాల్లో తిరిగే హక్కు లేదన్నారు. మంత్రులను, కాంగ్రెస్‌ నేతలను తిరగనివ్వం.. ఎక్కడికక్కడా అడ్డుకుంటామని హెచ్చరించారు. వెంటనే రైతులకు సరిపడా యూరియా అందించాలని, లేదంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఫెయిల్‌ అయిందన్నారు. ఏ ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్లు ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య పీఏసీఎస్‌ చైర్మెన్‌ కోల రమేశ్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు గుండు భూపేశ్‌, మల్లయ్య, వెంకట్‌రెడ్డి, మహేందర్‌గౌడ్‌ ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad