Sunday, October 5, 2025
E-PAPER
Homeబీజినెస్ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు 80 శాతం బోనస్‌

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు 80 శాతం బోనస్‌

- Advertisement -

బెంగలూరు : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తమ ఉద్యోగులకు భారీ బోనస్‌ను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఉద్యోగుల పనితీరు ఆధారంగా బోనస్‌ లెటర్లను జారీ చేసినట్టు పేర్కొంది. తొలి త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులకు సగటున 80 శాతం బోనస్‌ను ప్రకటించింది. గత త్రైమాసికంలో ఇచ్చిన 65 శాతం సగటు బోనస్‌ చెల్లింపుతో పోలిస్తే ఇది ఎక్కువ. ఈ బోనస్‌ను ఆగస్టు నెల జీతంతో కలిపి ఇవ్వనుంది. వివిధ స్థాయిల్లోని 3.23 లక్షల మందికి పైగా ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -