Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్లైఫ్‌సైన్స్‌ రంగంలో రూ.54 వేల కోట్ల పెట్టుబడులు

లైఫ్‌సైన్స్‌ రంగంలో రూ.54 వేల కోట్ల పెట్టుబడులు

- Advertisement -

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లైఫ్‌సైన్స్‌ రంగంలో రూ.54 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణా లైఫ్‌ సైన్సెస్‌ ఫౌండేషన్‌ బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అతి పెద్ద ఏడు లైఫ్‌ సైన్సెస్‌ క్లష్టర్లలో హైదరాబాద్‌ ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. ఔషధ తయారీ, మెడికల్‌ టెక్నాలజీ, టీకాల ఉత్పత్తి రంగాల్లో కొత్తగా 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలు సృష్టించగలిగామని వివరించారు. ‘లిల్లీ, యామ్‌ జెన్‌, ఎంఎస్‌డి, జోయెటిస్‌, ఎవర్‌ నార్త్‌, ఒలింపస్‌ లాంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌ ను ఎంపిక చేసుకున్నాయని గుర్తు చేశారు. త్వరలో తెలంగాణా నెక్స్ట్‌ జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీని ప్రకటిస్తామని చెప్పారు. పరిశ్రమలను పెద్ద ఎత్తున ఆకర్షించే అత్యుత్తమ విధానంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ చైర్మెన్‌ సతీష్‌ రెడ్డి, లారస్‌ ల్యాబ్స్‌ ఈడీ డాక్టర్‌ సత్యనారాయణ చావ, ఐటీ ప్రత్యేక కార్యదర్శి సంజరు కుమార్‌, శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad