నవతెలంగాణ – తానూర్: మండలంలోని జవూల(కె), గ్రామానికి చెందిన మాధవరావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మంగళవారం డాక్టరేట్ పట్టా అందుకొని గ్రామానికే కాకుండా మండలానికీ గౌరవాన్ని తీసుకువచ్చారు అని గ్రామస్తులు అన్నారు. ఆర్థికంగా అత్యంత వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఈ స్థాయి విజయాన్ని సాధించడం విశేషంగా నిలిచింది అని తెలిపారు. జాజూల్వాడ్ రోహిదాస్ – గంగబాయి దంపతుల కుమారుడైన మాధవరావు, “మంజుల్ భగత్ కె ఉపన్యాసో మే ఆధునిక సమాజ్ కే యథార్థ” అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 84వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ డా. నారాయణన్ చేతుల మీదుగా ఆయనకు పీహెచ్.డి పట్టా ప్రదానం చేయబడింది. ఈ పరిశోధనకు డా. సంగీత వ్యాస్ మార్గదర్శకత్వం వహించారు. రజక సమాజానికి చెందిన మాధవరావు, తానూర్ మండలంలో పిహెచ్డి పొందిన మొదటి వ్యక్తి కావడం ప్రత్యేకత. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, సహచరులు, మిత్రుల ప్రోత్సాహం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందడం ఎంతో గర్వకారణం” అని ఆనందం వ్యక్తం చేశారు.మాధవరావు విజయంతో గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. మిత్రబృందాలు, బంధుమిత్రులు, గ్రామస్తులు ఆయనను ఘనంగా అభినందించి, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు
జవలా(కే) గ్రామ వాసికి డాక్టరేట్.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES