Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్ప్రజలతోనే పయనం.. ప్రజల కోసమే జీవనం

ప్రజలతోనే పయనం.. ప్రజల కోసమే జీవనం

- Advertisement -

లక్ష కిలోమీటర్లు చేరుకున్న ఆది రథసారథి
ప్రతి రోజూ ప్రజల కోసం పరితపించే నేత రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఉదయం మొదలయినప్పటి నుంచి విరామం ఎరుగని నడక, అనునిత్యం ప్రజా క్షేత్రంలో “ఆది”
అందుకే ప్రజలు అంటుంటారు “ఆది”కి ఆదివారమే లేదని…
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

గెలిచిన 18 నెలల్లోనే ఏకంగా 1 లక్షా 200 కిలోమీటర్లు ప్రజా సేవ కోసం సాగిన పయనం. ఇది సాధారణ నాయకుడి కథ కాదు, ఇది ప్రజల కోసం శ్రమించే నిజమైన ప్రజానాయకుడి ప్రయాణం.. సాధారణంగా ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకుంటేనే చాలు, కొన్ని నెలల్లోనే ప్రజలకు దూరమవుతారు. ఇంక కొందరు పట్నంలో ఉండటానికి ఇష్టపడుతూ నియోజకవర్గ ప్రజలను ఆడప దడప కలుస్తూ ఉంటారు. కానీ, ఎన్నికల సమయంలో చూపిన తపన, ఎన్నికల అనంతరం కూడా మానని నాయకుడు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ .

ప్రతి రోజూ ప్రజల మధ్యే ఉంటూ, సమస్యలు వింటూ, వాటికి పరిష్కారాలు చూపిస్తూ, గ్రామాలు, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అందరితో కలిసే ఆచరణాత్మక నాయకత్వం ఆయనది. ఇది.. ఆయన ముద్ర వేసిన నాయకత్వ శైలి. విరామం లేని వృత్తి జీవితం, నిరంతర ప్రజా పరిచయం, విశ్రాంతి లేని ప్రజాసేవ – ఇవన్నీ ఆది శ్రీనివాస్  నిత్యజీవితంలో భాగంగా మారాయి. ప్రజలే దేవుళ్లు అన్న విలువను నమ్మి, వారి కష్టాలను తనవిగా భావిస్తూ, ప్రజల ఇంటిచేరువలో అడుగుపెట్టి వారి మధ్యే జీవించే నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమితులై, మరింత బాధ్యతతో తన పాత్రను నిర్వహిస్తున్నారు.

ఇలాంటి నాయకులు రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంటుంది. ప్రజల పట్ల ఆయన చూపే అపారమైన నిబద్ధతకు, గతంలో ఎమ్మెల్యేను కలవాలంటే ఎక్కడ ఉంటాడో కూడా తెలియని పరిస్థితి నుండి నేడు ఎమ్మెల్యేనే తమ గ్రామానికి వచ్చి ప్రజా సమస్యలను తెలుసుకోవడం పట్ల ఒకింత ప్రజలే ఆయన పట్ల మంత్రముగ్ధులు అవుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad