దోపిడి విధానానికి వ్యతిరేకంగా పోరాడిన కామ్రేడ్కు జోహార్లు
మృతదేహంపై ఎర్రజెండా కప్పి ఘనంగా నివాళులు
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
నవతెలంగాణ – నెల్లికుదురు
ఉద్యమాల కర్ర జెండా కిరీటం కామ్రేడ్ నేలకుర్తి సీతారాం రెడ్డి మృతి చెందడం తో కుటుంబాన్ని సందర్శించి ఓదార్చే కార్యక్రమం నిర్వహించినట్లు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాధన శ్రీనివాస్ తెలిపారు. గురువారం బంజర గ్రామంలో నెలకుర్తి వెంకట్ రెడ్డి తండ్రి సీతారాం రెడ్డి స్వగృహం వెళ్లి పార్దవ దేహానికి ఎర్రజెండా కప్పి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఐ(ఎం) మహబుబాబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీతారాం రెడ్డి అతి చిన్న వయసులోనే ఉద్యమాల వైపు ఆకర్షితులై దోపిడి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించారని కార్మికులు రైతాంగ పట్లా బూర్జువా భూస్వామ్య దారుల విధానాలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన పోరాటం నిర్వహించారని అన్నారు.
వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కదిరి ప్రజా సమస్యలపై పోరాటాల నిర్వహించాలని అన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి మృతి చెందడం ఈ ప్రాంతానికి తీరనిలోటు అని అన్నారు. తన ఉద్యమంలో ఎంతో మదికి మేలు జరిగిందని చెప్పారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేదల పక్షాన నిలబడిన గొప్ప మహానుభావుడు అని అన్నారు. ఆయన ఈరోజు లోకంని విడిచి వెళ్ళడం ఎంతో లోట్ అని చెప్పారు .తండ్రి చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులైన కొడుకు నెలకుర్తి వెంకటరెడ్డి పేదల ప్రక్షాళన ఉండి పోరాడుతున్నాడని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుణగంటి రాజన్న సూర్ణపు సోమన్న సమ్మెట రాజమౌళి. డీఎంజేయు రాష్ట్ర కార్యదర్శి యస్ కే జానిమియా బొడ్డు అశోక్ సీపీఐ(ఎం) నెల్లికుదురు మండల కార్యదర్శి ఇసంపేల్లి సైదులు మాజీ మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు నాయకులు తొట నర్సయ్య బానాల యాకయ్య బత్తెం సత్యనారాయణ యాకుబ్.కె ఉప్పలయ్య బత్తిని వెంకన్న.పుల్లయ్య డి.కొమురయ్య పి.వెంకన్న. పి.ఉపేందరు మంగ్యా బిచ్చనాయక్ వాల్యా తదితరులు పాల్గొన్నారు.
సీతారాం రెడ్డి అశయాలను కొనసాగిద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES