కావాలనే దుష్ప్రచారం..
తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్..ఇప్ప మొండయ్య..
నవతెలంగాణ – మల్హర్ రావు
పాలకవర్గం, సిబ్బంది సమన్వయంతోనే రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా తోపాటు పలు రకాల ఎరువుల పంపిణీ సజావుగా జరుగుతుందని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య తెలిపారు. గురువారం పిఏసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఎరువుల గోదాంకు బుధవారం సాయంత్రం 5:30 గ లకు 20 టన్నుల యూరియ రావటం జరిగిందని తెలిపారు. అయితే హమాలీలు వచ్చి దిగుమతి చేసే వరకు రాత్రి 7 అయినట్లుగా తెలిపారు. లారీ వచ్చే సమయంలో రైతులు గోదాం దగ్గర ఎరువుల కొరకు రావటం వలన లారీ దిగుమతి అయ్యే సమయం వరకు వేచి చూడటం జరిగినట్లుగా పేర్కొన్నారు.
ఎరువుల కోసం తాడిచెర్ల తోపాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎరువుల రవాణా వాహనాలు తీసుకొని రావటం వలన ఆ సమయంలో ఎరువుల అమ్మకం కుదరదని చెప్పడం జరిగిందన్నారు.అయితే కొంత మంది రైతులు తిరిగి వెళ్లిపోగా,మరికొందరుచుట్టూ పక్కల గ్రామాల రైతులు ఎరువుల రవాణా వాహనాలు తీసుకొని ఉండటం జరిగిందన్నారు. ఇంటికితిరిగి పోయి రావటం ఇబ్బంది అవుతుందని గొడవ చేయటంతో రైతుల ఇబ్బందిని గుర్తించి కొంత మంది రైతులకు ఎరువులు అమ్మకం జరిగిందని తెలిపారు.ఇది గమనించిన వారు ఎరువుల దుకాణంలో గొంగతనం జరిగిందని దుష్పచారం చేయడం విడ్డురంగా ఉందన్నారు. ఇంటికి తిరిగి వెళ్ళిన రైతులు తమకు ఎరువులు ఇవ్వకుండా అక్కడున్న వారికి ఎలా ఇస్తారని ఆందోళనకు దిగినట్లుగా పేర్కొన్నారు.అంతేకాని ఎరువులు చోరీ కానీ, పక్క దారి పట్టించటం జరగలేదని వివరించారు.
ప్రస్తుత పరిస్థితులను ముందే గ్రహించి రైతులకు ఇబ్బంది కలగకుండా పాలకవర్గంతోపాటు సిబ్బంది సమన్వయంతో రైతులకు యూరియా విషయంలో ఇబ్బందులు కలగకుండా సప్లయ్ చేయటం జరుగుతుందన్నారు.ఈ నేపథ్యంలో గురువారం వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులు ఎరువుల దుకాణంలో తనిఖీలు చేపట్టగా రికార్డుల్లో అంతా సజావుగా జరుగుతున్నట్లుగా సమాచారం ఇచ్చినట్లుగా తెలిపారు.
సమన్వయంతోనే రైతులకు ఎరువుల పంపిణీ.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES