Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సహకరించడానికి సిద్దంగా ఉన్నం..

సహకరించడానికి సిద్దంగా ఉన్నం..

- Advertisement -

గణేష్ మండప నిర్వాహకులు నిబంధనలు పాటించాలి..
నవతెలంగాణ – డిచ్ పల్లి

గణేష్ మండప నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలని, డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకుని రావాలని తహసిల్దార్ వెంకట్ రావు, ఎస్ హెచ్ ఓ జి సందీప్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంత్ రావు,టి జి ఎన్ పి డి సి ఎల్ ఏఈ జ్ఞానేశ్వర్ లు పేర్కొన్నారు. గురువారం ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ లో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గణేష్ మండప నిర్వాహకులతో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండపం వద్ద విద్యుత్ తీగలతో జాగ్రత్తలు పాటించాలని, వర్షం సందర్భంగా మండపంపైన పాలిథీన్ కవర్లు వాడాలని, రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలని తెలిపారు.

గణేష్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజల నుంచి డబ్బులను బలవంతంగా వసూలు చేయవద్దని, మండపలతో ఎవరికి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారికి సమాచారం అందిం చాలన్నారు. గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేయాలన్నారు. మేకలు, పశువులు రాకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి మండపం వద్ద రాత్రి సమయంలో ఒకరు ఉండే విధంగా చూడాలన్నారు.

 గణేష్ మండలి వద్ద పూజా కార్యాక్రమంలో క్యూ పద్దతి పాటించాలని, బారికేడ్లను విధిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలిపారు. గణేష్ నిమజ్జనాల వరకు ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు అన్ని శాఖలు సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు  చేపడతామని కానీ ముందస్తుగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చేయనివారు ఉంటే వేంటనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పోలీసులు ఇచ్చే ఒక ట్యాగ్ ఆధారంగానే సేవలను పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాలకు చెందిన మండపాల నిర్వాహకులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad