నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జాగృతి డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా ఎన్నికైన సింగన బోయిన మల్లేష్ యాదవ్ ను యాదవ విద్యావంతుల వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొత్తపెళ్లి ఆనంద్ యాదవ్ మాట్లాడుతూ భువనగిరి పట్టణంలో దాదాపుగా 25 సంవత్సరాలుగా విద్యారంగంలో రాణిస్తూ అనేకమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు వాళ్ల అభ్యున్నతికి బాటలు వేసిన విద్యావేత్త సింగన బోయిన మల్లేష్ యాదవ్ ని అభినందిస్తూ మున్ముందు మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. యాదవ సంఘం జిల్లా నాయకులు శెట్టి బాలయ్య యాదవ్, యాదవ్ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్, గౌరవ సలహాదారు తోటకూర యాదయ్య యాదవ్, జీనియస్ స్కూల్ ప్రిన్సిపల్ సూర్యనారాయణ రెడ్డి, భాస్కర్ యాదవ, వల్లాల రాజు యాదవ్ లు పాల్గొన్నారు.
నూతన జాగృతి కళాశాల ప్రిన్సిపల్ మలేష్ యాదవ్ కి సన్మానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES