Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు విరివిరిగా రుణాలు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు విరివిరిగా రుణాలు

- Advertisement -

సెర్ప్, మెప్మా ద్వారా రూ. 50.95 కోట్ల రుణాలు మంజూరు
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా జిల్లాలో లబ్దిదారులు అందరూ ఇంటి నిర్మాణం చేపట్టి సొంతింటి కలను సాకారం చేసుకునేలా ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్నామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే గృహ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఆర్థిక స్థోమత లేని లబ్దిదారులైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు జిల్లా గ్రామాభివృద్ధి సంస్థ, మెప్మా ద్వారా విరివిరిగా రుణాలు అందిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు 4348 మంది లబ్దిదారులకు రూ. 50.95 కోట్ల రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ వెల్లడించారు. ఇందులో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 3916 మంది లబ్దిదారులకు రూ. 46.59 కోట్లు, మెప్మా ద్వారా 432 మందికి రూ. 4.36 కోట్లు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల కోసం మంజూరు చేశామని తెలిపారు. అర్హులైన ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులకు సెర్ప్, మెప్మా ద్వారా మరింత విరివిగా రుణాలు అందించడం జరుగుతుందని, లబ్దిదారులు అందరూ వెంటనే ఇంటి నిర్మాణ పనులను చేపట్టి, త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి హితవు పలికారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad