Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గీత కార్మికులకు ఇచ్చిన హామీలను మరచిన కాంగ్రెస్ ప్రభుత్వం..

గీత కార్మికులకు ఇచ్చిన హామీలను మరచిన కాంగ్రెస్ ప్రభుత్వం..

- Advertisement -

కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయ రాములు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు అన్నారు. గురువారం కలుగీత కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలోని గెస్ట్ హౌస్ లో  మండల అధ్యక్షులు పాండాల మైసయ్య అధ్యక్షతన నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో గౌడ కల్లు గీత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రతి గీత కార్మికునికి 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని, వైన్స్ లలో 25% కేటాయిస్తామని, కల్లుగీత కార్మికులు వృత్తిలో ప్రమాదాలు జరిగి చనిపోయిన గాయపడిన ప్రభుత్వ పరంగా ఇచ్చే ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలకు పెంచుతామని అన్నారని అన్నారు. 

 వారి సంక్షేమానికి బడ్జెట్లో అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు గడిచిన ఇప్పటివరకు ఈ ప్రభుత్వం కల్లు గీత కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన మాటకు కట్టుబడి లేదని విమర్శించారు.  చేతివృత్తులలోనే అత్యంత ప్రమాదకరమైన వృత్తి కల్లుగీత వృత్తి ఆని ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన ఓట్లు మాత్రం దండుకుంటున్నారని వారి సంక్షేమాన్ని మాత్రం విస్మరిస్తూన్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత కార్మిక సంఘం కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు నిర్మించి అనేక హక్కులు సంఘం ఆధ్వర్యంలో సాధించుకోవడం జరిగిందని సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉద్యమాలు మాత్రమే పరిష్కారమని అన్నారు.

వాటికోసం గీత కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమాలలో పాల్గొని ప్రభుత్వాల మెడల్ వంచ వలసిన అవసరం ఉన్నదని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం మండల కార్యదర్శి మట్ట బాలరాజు, జిల్లా నాయకులు కొండా అశోక్, రంగా కొండల్, మచ్చ భాస్కర్, గడ్డమీది సోములు, మండల నాయకులు గడ్డమీది చంద్రం, రాంపల్లి సోములు, వద్ధి బాలరాజు, గోదా సాయిలు, నల్ల మాస స్వామి,  రంగస్వామి, దంతూరి వెంకటేష్, బోయిని నరసింహ, దూసరి మైసయ్య, నాగేల్లి దానయ్య, గంధ మల్ల భాస్కర్, కాసుల రామలచ్చయ్య, డొంకన పాండురంగం, డొంకేన పాండు లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad