Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బ్రాంచ్ మేనేజర్ పై ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ఫిర్యాదు.. 

బ్రాంచ్ మేనేజర్ పై ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ఫిర్యాదు.. 

- Advertisement -

అసభ్యకరంగా దురుసుగా ప్రవర్తనా..
డిచ్ పల్లి మండల పొదుపు సంఘాల మహిళల ఆరోపణ..
నవతెలంగాణ – డిచ్ పల్లి

బ్యాంకుకు వెళ్లిన మహిళలతో మేనేజర్ అసభ్యకరంగా దురుసుగా ప్రవర్తిస్తారని ఒక మహిళ అయి ఉండి సాటి మహిళలతో అమర్యాదగా వ్యవహరిస్తారని, ఏదైనా సంఘం రుణం కట్టనిచో వివో ఏల వ్యక్తిగత ఖాతా నుండి బెదిరించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారని తెలిపారు. నాబార్డ్ నిబంధనలు ఎన్డీసీసీబి అన్ని బ్రాంచ్ల్లో వర్తిస్తవి కానీ, ఎన్ డి సి సి బ ఏ బ్రాంచ్ లో కూడా లేని నిబంధనలు పెడుతూ ఖాతాదారులను మహిళా సంఘాలను ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి దృష్టికి తీసుకొని వచ్చారు. గురువారం మహిళా సంఘాల సభ్యులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసిలిఖిత పూర్వక వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  డ్వాక్రా సంఘాలకు మంజూరైన రుణాలు గత రెండు నెలలుగా నిబంధనల పేరుతో ఇవ్వకుండా ఎన్డీసీసీబీ డిచ్ పల్లి మేనేజర్ బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారని, గతంలో ఎన్ డి సి సి బి హెడ్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయగా నాపైనే హెడ్ ఆఫీస్ లో ఫిర్యాదు చేస్తారా నన్ను ఎవరు ఏమి చేయలేరు. మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని మాపై దురుసుగా మాట్లాడుతున్నా..రని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఎన్ డి సి సి బి బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి కి ఫోన్ చేసి మాట్లాడుతూ మహిళా సంఘాలకు ఇబ్బందులు కలిగిస్తున్న మేనేజర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ,మహిళా సంఘాలకు రుణాలు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించినట్లు మహిళా సంఘాల సభ్యులు విలేకరులకు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad