Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్కేటీఆర్‌ భాష.. థర్డ్‌ క్లాస్‌

కేటీఆర్‌ భాష.. థర్డ్‌ క్లాస్‌

- Advertisement -

– ప్రజా పాలన పథకాలను చూసి ఓర్వలేకే కుట్రలు
– ఉప రాష్ట్రపతి ఎన్నికలో తెలంగాణ బిడ్డకు మద్దతివ్వాలి
– ఎవరికి మద్దతిస్తారో బీఆర్‌ఎస్‌ విజ్ఞతకే వదిలేశాం
– ఈ నెల 24న గంగాధరలో ‘జనహిత పాదయాత్ర’
– నేరుగా ప్రజలతో మమేకమయ్యేందు ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ రాక
– రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
యూరియా కొరతపై ప్రతిపక్షాల విమర్శలకు రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమశాఖ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్‌ మాటతీరు ‘థర్డ్‌ క్లాస్‌’గా మారిందని మండిపడ్డారు. యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, ఈ విషయం పదేండ్లు మంత్రిగా పని చేసిన కేటీఆర్‌కు తెలియదా?అని ప్రశ్నించారు. రైతులను భయభ్రాంతులకు గురిచేసి, తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డిని ఎంపిక చేసిందని, ఆయన తెలంగాణ బిడ్డ అని పొన్నం ప్రభాకర్‌ గుర్తు చేశారు. ఈ విషయంలో బీజేపీతో కలిపి వెళ్తారా, లేదా తెలంగాణ బిడ్డకు మద్దతిస్తారా అనేది బీఆర్‌ఎస్‌ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన పథకాలను మంత్రి వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, 60 వేల ఉద్యోగాల భర్తీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వీటిని చూసి ఓర్వలేకే బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాయని ఆరోపించారు. ఎరువుల కొరత సష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాదని, రైతులు గమనించాలని కోరారు. ఎరువుల సరఫరా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, దీనిపై తమ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కలిసింది అని స్పష్టం చేశారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజరు ఈ సమస్యపై చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వివక్షతో వ్యవహరిస్తోందని, బీజేపీకి అనుబంధంగా పని చేస్తోందని ప్రజలు భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరంలో రెండో టీఎంసీ నీరు తీసుకురాలేకపోయిందని అన్నారు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.

తాము ప్రత్యేక నిధులు కేటాయించి అభివద్ధికి కషి చేస్తున్నామని తెలిపారు.ఈ నెల 24న గంగాధరలో ‘జనహిత పాదయాత్ర’కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘జనహిత పాదయాత్ర’ ఈ నెల 24వ తేదీన కరీంనగర్‌ జిల్లాలో ప్రారంభం కానుందని, చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల నుంచి కురిక్యాల చౌరస్తా మీదుగా ఈ పాదయాత్ర సాగుతుందని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ యాత్రలో పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ పాల్గొంటారని ఆయన వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యక్రమంగా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, అనుబంధ సంఘాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ‘జనహిత పాదయాత్ర’ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయో నేరుగా తెలుసుకుంటారని, వారి కష్టాలను అడిగి తెలుసుకుంటారని తెలిపారు. ఈ యాత్రకు ముఖ్యమంత్రి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad