Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్రోడ్లపై పశువులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..

రోడ్లపై పశువులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పశువులు రాకుండా చూడాలని, వాటి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని  యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దాసరి గణేష్ ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు సాయి నాయక్ అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్నారం ఎస్ఐ గొల్లపల్లి అనూషకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జన్నారం పట్టణంలోని రోడ్లపై అధికంగా ఆవులు తిరగడం వలన తరచూ తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాటి నివారణ కోసం తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల నాయకులు, వినీత్, రఘు, రాకేష్ ,సుమిత్,సాయి రెడ్డి, బన్నీ , పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad