నవతెలంగాణ – మిరుదొడ్డి
రైతులు యూరియా కోసం అధైర్య పడాల్సిన అవసరం లేదని సరైన సమయంలో యూరియా రైతులకు అందిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి తెలిపారు. యూరియా బస్తాల మాదిరిగానే నానో యూరియా సైతం ఉపయోగపడుతుందని రైతులు నానో యూరియాను ఉపయోగించాలని సూచించారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతో పాటు పార్టీలైజర్, చెప్యాల చౌరస్తాలోని ఆగ్రో రైతు సేవ కేంద్రాన్ని డీఏవో స్వరూపరాణి ఏవో మల్లేశంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి రైతులకు ఇబ్బందులు కలగకుండా, యూరియా వచ్చిన వెంటనే సరఫరా చేయాలని సూచించారు. యూరియా తీసుకున్న ప్రతి రైతు వివరాలను ఆన్లైన్ చేసి రసీదులు అందించాలని సూచించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ఆగస్టు నెల వరకు 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, నేటికీ 25వేల మెట్రిక్ టన్నుల యూరియా రావడం జరిగిందన్నారు. గతంలో కన్నా ఈ సంవత్సరం 50 వేల ఎకరాలలో సాగు పెరగడంతో యూరియా కొరత తలెత్తిందన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి యూరియా సమస్యను తీసుకువెళ్లామని వెంట వెంటనే రైతులకు అవసరమైన మండలాలకు యూరియా లారీలలో తీసుకువచ్చి పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. మొక్కకు కావలసిన పోషకాలు నానో యూరియాలో సైతం ఉంటుందని, రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నానో యూరియాను పంటలకు వాడాలన్నారు. యూరియా దొరకదనే అపోహతో రైతులు అధికంగా యూరియా కొనుగోలు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మల్లేశం , ఏ ఈ ఓ ప్రశాంత్ , పిఎసిఎస్ సెక్రెటరీ రాజు ఆగ్రోస్ సేవా కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.
యూరియా కోసం రైతులు అధైర్య పడొద్దు: ఏఓ స్వరూప రాణి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES