Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యాదాద్రి పవర్ ప్లాంట్ ఎదుట నిర్వాసితుల సంబరాలు

యాదాద్రి పవర్ ప్లాంట్ ఎదుట నిర్వాసితుల సంబరాలు

- Advertisement -

సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ – దామరచర్ల

దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద  యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన సందర్భంగా పవర్ ప్లాంట్ ఎదుట గురువారం భూ నిర్వాసితులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చుతూ అనందం తో నృత్యాలు చేశారు.  సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఉత్తమ్ కుమార్రెడ్డి ,ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ల చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములను ఇచ్చిన 335 మంది కి ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని నిర్వాసితులు అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad