Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆయిల్ ఫామ్ సాగును సబ్సిడీతో ప్రోత్సహిస్తుంది: ఏఓ మేకల గోవిందు 

ఆయిల్ ఫామ్ సాగును సబ్సిడీతో ప్రోత్సహిస్తుంది: ఏఓ మేకల గోవిందు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
ఆయిల్ ఫామ్ సాగును సబ్సిడీతో ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవింద్ అన్నారు. పట్టణంలోని  ఆయిల్ ఫామ్ సాగుపై గురువారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పంటను ఒకసారి నాటితే నాలుగు సంవత్సరాల తర్వాత నిరంతర ఆదాయాన్ని 30 సంవత్సరాల పాటు పొందవచ్చని తెలిపారు. ఈ పంట సాగుకు కోతులు, పందుల బెడద ,దొంగల బెడద ఉండదని తక్కువ కూలీలతో ఈ పంట సాగు చేయవచ్చని తెలిపారు. మొక్కలకు రైతు కేవలం ఒక ఎకరానికి వెయ్యి రూపాయలు డిడి చెల్లిస్తే  50 మొక్కలు అందిస్తుందని తెలిపారు.

ఈ పంట మధ్యలో అంతర పంటలు వేసుకోవచ్చని అందులో భాగంగా మొక్కజొన్న, కూరగాయలు, సోయా వేసుకునేందుకు గాను ఎకరానికి 4700 చొప్పున రైతు ఖాతాలో సంవత్సరానికి ఒకసారి జమ చేస్తారని తెలిపారు. ఆయిల్  ఫామ్ పంట సాగులో లాభాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. పట్టణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని తనిఖీ చేసి రైతులకు సరిపడా యూరియా మండలంలో అందుబాటులో ఉందని, ఎక్కడ యూరియా కొరత లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ ఏ విజయలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ, సొసైటీ చైర్మన్ కాపల్లి చిన్న ముత్తన్న, ఏ ఈ ఓ అనూష ,సొసైటీ సీఈఓ రాజేశ్వర్, సొసైటీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad