నవతెలంగాణ – కామారెడ్డి
వర్షాల ప్రభావంతో నీరు నిల్వ ఉండి అధికంగా దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో పాశుద్ధ్య కార్యక్రమాలను జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు కురిసిన అనంతరం వాన నీరు నిలిచి ఉండి ఆ నీటిలో దోమలు గుడ్డు పెట్టి దోమలు అధికంగా వృద్ధి చెందాయని అధికారులు జిల్లా వ్యాప్తంగా గ్రామాలు పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మరింత పకడ్బందీగా నిర్వహించి ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నీరు నిలువ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయాలని, డ్రైనేజీలు శుభ్రం చేయాలని, డ్రై డే రెగ్యులర్ గా నిర్వహించాలని అన్నారు. మరొకసారి జిల్లాలో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డ్రైనేజీలు బ్లాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వనమహోత్సవం కార్యక్రమం ద్వారా కామారెడ్డి మున్సిపాలిటీకి నిర్దేశించిన రెండు లక్షల మొక్కలను ఈ నెల చివరిలోగా నాటి జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో వివరాలను పొందుపరచాలని, కలెక్టరేట్ ఆవరణలో మియావకి పద్ధతిలో మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని, వర్షాలలో దెబ్బతిన్న పట్టణంలోని రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేయించాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి ని ఆదేశించారు.
పారిశుద్ధ్య కార్యక్రమాలు పగడ్బందీగా నిర్వహించాలలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES