Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అభివద్ధి, సంక్షేమం..

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అభివద్ధి, సంక్షేమం..

- Advertisement -

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
– ఈ నెల 24న గంగాధరలో జనహిత పాదయాత్ర
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 19 నెలల్లోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేసి చూపించిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. పార్టీ చేపట్టిన ‘జనహిత పాదయాత్ర’ గురించి ఆయన కరీంనగర్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన గంగాధర మండలంలో ఈ పాదయాత్ర ఉంటుందని, దీనికి ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలో 21 లక్షల కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేశామని, సన్నబియ్యం పంపిణీ కూడా ప్రారంభించామని చెప్పారు. రైతుల కోసం రూ. 21 వేల కోట్లు రుణమాఫీ చేశామని వెల్లడించారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. బోనస్‌:లిలి సన్న వడ్లకు రూ. 500 బోనస్‌ ఇస్తున్నామని గుర్తు చేశారు.జనహిత పాదయాత్రఈ నెల 24వ తేదీన సాయంత్రం 4 గంటలకు గంగాధర మండలంలో ‘జనహిత పాదయాత్ర’ ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ఈ యాత్రలో ఏఐసీసీ ఇన్‌చార్జి లిలిమీనాక్షి నటరాజన్‌, పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా రాష్ట్రంలోని ముఖ్య నాయకులంతా పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త పాల్గొంటారని ఆయన తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad