నవతెలంగాణ – జన్నారం
మండలంలోని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గా విధులు నిర్వహిస్తున్న మేక లావణ్య ఇటీవలే కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా గురువారం గ్రామంలోని యువత వారికి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ముందు ముందు గ్రామానికి మరిన్ని గొప్పగా సేవలు అందించి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరారు. అలాగే సెక్రటరి లావణ్య మాట్లాడుతూ .. నాకు ఈ అవార్డు రావడానికి కారణం గ్రామంలోని ప్రజలు నాయకులు యువత సహకారం వల్లనే నాకు ఈ గౌరవమైన బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు రావడం జరిగిందని, గ్రామంలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పెరుగు మల్లికార్జున్, కూకటికారు శంకర్, రేగుంట ప్రదీప్, గుగ్లావత్ రవి నాయక్, కామెర శివాజీ, కూకటికారు గంగాధర్, దేవ రాజమౌళి, రత్నం రాజమౌళి, లిన్నేక్, జునుగూరి వెంకట్, అటుకపురం వెంకటేష్, గ్రామ పెద్దలుసాధం చిన్నయ్య, గ్రామపంచాయితీ సిబ్బంది సిందం శ్రీనివాస్, కూకటికారి ఆనందం పాల్గొన్నారు .