కులగనన జరిగితే మోడీ పీఠాలు కదులుతాయి ..
రైతులకు యూరియా సరఫరా లో కేంద్రం వివక్షత చూపుతుంది …
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మోడీ తెలంగాణను ఓట్ల చోరీకి రోల్ మోడల్ గా ఎంచుకున్నారని ,జనగణన, కులగణన జరిగితే మోడీ పీఠాలు కదులుతాయని,
రైతులకు యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఈ విషయంలో కేటీఆర్ కేంద్రంపై పోరాడటం లేదని ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ అద్దంకి దయాకర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. తెలంగాణలో ఓట్ల చోరీ జరగకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు వచ్చేవని, మహారాష్ట్రలో 5 నెలల కాలంలో కోటి ఓట్లు ఎలా పెరిగాయని, ఓట్ల దొంగలంతా బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. యూరియా విషయంలో కేంద్రంతో యుద్ధం చేయకుండా కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని దయాకర్ పేర్కొన్నారు. కేటీఆర్, కేసీఆర్ కొడుకు కాకపోతే సున్నా అని, ప్రజలను అబద్ధాలతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
యూరియా సరఫరా చేసే వారికే ఓటు వేస్తామని కేటీఆర్ అనడం సమంజసం కాదని అన్నారు. 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన బీజేపీ 8 ఎంపీ సీట్లు ఎలా గెలిచిందని దయాకర్ ప్రశ్నించారు. కేటీఆర్, కేసీఆర్ లకు సంబంధం లేకుంటే బీజేపీకి ఎట్లా ఓటు వేస్తారని నిలదీశారు .కాంగ్రెస్ పార్టీ కొత్త నాయకత్వానికి అవకాశం కల్పిస్తుందని దయాకర్ తెలిపారు. పట్టణ, మండల స్థాయి పార్టీ పదవులన్నీ యువతకే ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ చెప్పారని పేర్కొన్నారు.
నామినేటెడ్ పదవులు… పార్టీ కోసం కష్టపడిన వారికే వస్తాయని, పదవులు చాలా ఉన్నాయని చెప్పారు. 2017 కంటే ముందు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూనే, తర్వాత వచ్చిన వారికి కూడా ప్రాధాన్యతను బట్టి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎంత మంది ఏకమైనా రాహుల్ గాంధీని ఏమీ చేయలేరని, భవిష్యత్తులో రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి అవుతారని దయాకర్ ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలవుతుంటే కొందరికి కళ్ళు మండుతున్నాయని దయాకర్ అన్నారు.
గత ప్రభుత్వం వల్ల లక్ష కోట్ల నష్టం జరిగిందని దయాకర్ ఆరోపించారు. ప్రతి ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు.
గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు.రాజ్యాంగం కంటే ఎన్నికల కమిషన్ ఎక్కువ కాదని, అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించారని దయాకర్ గుర్తుచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు 90 సీట్లు రావాల్సి ఉండగా, ఓట్ల దొంగలంతా బీజేపీకి మద్దతు ఇస్తున్నారని దయాకర్ ఆరోపించారు. మహారాష్ట్రలో ఐదు నెలల కాలంలో కోటి ఓట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. తెలంగాణ ఓట్ల చోరీకి మోడీ రోల్ మోడల్‌గా ఎంచుకున్నారని విమర్శించారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ లు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించారు.
జనగణన, కులగణన జరిగితే మోడీ పీఠాలు కదులుతాయని దయాకర్ పేర్కొన్నారు. “మోడీ డిసెంబర్‌లో ఉంటాడో ఊడుతాడో“ అని వ్యాఖ్యానించారు.గత ప్రభుత్వం వల్ల లక్ష కోట్ల నష్టం జరిగిందని, ప్రతి ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్సేనని దయాకర్ అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరులోకి నీరు వస్తుందని తెలిపారు.
ఎన్నికల కమిషన్ రాజ్యాంగం కంటే ఎక్కువ కాదని, రాజ్యాంగం సామాన్యుడికి అధికారం కట్టబెట్టిందని, అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించారని దయాకర్ గుర్తు చేశారు. సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులే గెలవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ విప్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం ఓట్ల చోరీకి తెలంగాణను రోల్ మోడల్ గా ఎంచుకుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES