జీవో 282 రద్దుకు ఉద్యమించాలి
తెలంగాణ ప్రజాప్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి..
నవతెలంగాణ – మల్హర్ రావు
8 గంటల పని విధానాన్ని 10 గంటలకు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో 282ను జారీ చేస్తూ,పెట్టుబడిదారులకు కార్పొరేట్లు కొమ్ముకస్తూ కార్మిక వర్గానికి ద్రోహం చేస్తోందని, జీవో 282 రద్దుకై ఉద్యమించాలని కార్మిక వర్గానికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని కొయ్యూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పని గంటల పెంపు జీవో నెంబర్ 282 ను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ దుకాణాలు, స్థాపనల చట్టం 1988 లోని సెక్షన్లు 16,17 కి సవరణ చేస్తూ 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతూ జులై ఐదున రాష్ట్ర ప్రభుత్వం జీవో 282ను విడుదల చేసిందని,పని దినాన్ని చట్టబద్ధం చేసింది. ఈ జీవో పెట్టుబడిదారులకు కార్పొరేట్ల సంస్థలకు ప్రయోజనాలకు, లాభపేక్ష కోసమే ఉద్దేశించబడిందన్నారు. ఈ జీవో అమలయితే కార్మికులు తీవ్ర శ్రమ దోపిడీకి గురివుతారని, వ్యాపారం సవ్యంగా చేసుకునే పరిస్థితి ఉండదన్నారు.కావున జీవో రద్దు కోసం కార్మికుల, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పోరాడాలని పిలుపునిచ్చారు.
కార్మిక వర్గానికి ద్రోహం చేస్తున్న ప్రభుత్వం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES