నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన,శిఖర స్థాపన మహోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. బీ.సీ కాలనీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ కమ్యూనిటీకి పెద్ద పీఠ వేస్తుందని తెలిపారు.జుక్కల్ నియోజకవర్గంలో కూడా ముదిరాజ్ కమ్యూనిటీ అభివృద్ధికి తాను కృషి చేస్తానని తెలిపారు.
వారిసమస్యలనుపరిష్కరించడమే గాక అన్ని విధాలుగా అండగా ఉంటానని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ముదిరాజ్ లకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తానని భరోసా ఇచ్చారు. ముదిరాజ్ సంఘం భవనం కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే రూ. 20 లక్షలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు అశోక్ ఉపాధ్యక్షులు చిన్న ముదిరాజ్ సంఘం కుల పెద్దలు విగ్రహ దాత నాందేవ్ మేస్త్రి మహోత్సవ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో విరాళాధాత సంతోష్ మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES