నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని గోల్ హనుమాన్ దేవాలయ కమిటీ నూతన చైర్మన్ పాలకవర్గ సభ్యులతో గురువారం ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్అలీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. గోల హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ గా బండారి నరేందర్, డైరెక్టర్లుగా తోడుపునూరి రామ్మోహన్, గుండ సుధీర్, కరిపె లింగం, క్యాసారం విజయకుమార్, ఉప్పరి స్వప్న, గంట జ్యోతి లను ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ..గోల్ హనుమాన్ ఆలయం చాలా పురాతనమైనది. మహిమలు గల దేవాలయం. నాకు ఆలయల అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన ఆంజనేయ స్వామివార్లు ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా స్వామి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మీకు ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని హనుమంతుని కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని దాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కోరికలు కోరుకున్న వారికి కోరికలు నెరవేరుతాయని ,ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. ఆలయ అభివృద్ధికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ ఆకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్, నూడా చైర్మన్ కేశ వేణు, నరాల రత్నాకర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.