నవతెలంగాణ – కంఠేశ్వర్
అంగడి బజారులో మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ(ఎం) జిల్లా పార్టీ కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నవీపేట్ మండల కేంద్రంలో సీపీఐ(ఎం) సభ్యుల విస్తృత స్థాయి సమావేశము నిర్వహించడం జరిగింది. అనంతరము నవీపేట అంగడి బజార్ ను సందర్శించి మొరం వేయడం వల్ల వర్షం పడితే మహిళలకు వృద్ధులకు అంగడికి వచ్చే వారందరికీ అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.70 లక్షల ఆదాయం వస్తున్న సిసి ఏర్పాటు చేసి ప్లాట్ ఫామ్ నువ్వు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు యూరియా అందలేని పరిస్థితి ఉపాధి కూలీలకు సంవత్సరానికి రూ.12000 ఇస్తానన్న హామీ ప్రతి మహిళకు రూ.2500 ప్రస్తుతం వస్తున్న పెన్షన్కు డబుల్ చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని ఇప్పటికైనా వెంటనే అమలు చేయాలని అన్నారు. లేనియెడల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్, దేవేందర్ సింగ్, వసంత్, మహబూబ్, సావిత్రి, సిఐటియు మండల అధ్యక్షులు మేకల ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
అంగడి బజారులో మౌలిక వసతులు కల్పించాలి: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES