నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ వారి ఆదేశాల మేరకు ఆగస్టు 22 మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పనుల జాతర లో పనులను భువనగిరి ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ దినాకర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో గ్రామసభ నిర్వహణ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, సీసీ రోడ్లు, ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు పశువుల పాఠాలు, గొర్రల షెడ్లు , వ్యక్తిగత,కమ్యూనిటీ ఇంకుడు గుంతల పనులకు సంబంధించి పూర్తయిన పనులను ప్రారంభోత్సవాలు, మంజూరైన పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు ద్వారా పనులజాతరను చేపట్టడం జరుగుతుందనారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు సన్మానం, ఎక్కువ పని దినాలు చేసిన దివ్యాంగ ఉపాధిహామీ కూలీలకు సన్మానం, మొక్కలు నాటే కార్యక్రమం మొదలైనవి చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి అన్ని శాఖల అధికారులు గ్రామ ప్రజలు ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని పనుల జాతర గ్రామ సభలను విజయవంతం చేయవలసిందిగా కోరారు.
పనుల జాతర పనులను పరిశీలించిన ఎంపీడీవో శ్రీనివాస్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES