రిమాండ్ కు తరలింపు..
నవతెలంగాణ – కామారెడ్డి
దొంగతనాలు, అటెన్షన్ డైవర్షన్ దొంగతనాలకు పాల్పడిన నలుగురు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తేదీ 26.02.2025 న భిక్నూర్ గ్రామంలో సాయంత్రం అందాజ 04:30 గంటల సమయంలో భిక్నూర్ బాయ్స్ హై స్కూల్ ప్రక్కన గల దత్తాత్రీ బాంబు మర్చంట్ షాప్ వద్దకు అక్కడ ఒంటరిగా ఉన్న బిక్నూర్ మండల కేంద్రానికి చెందిన మహిళా ఊరే లక్ష్మీ, అయిన పిర్యాదిరాలు వద్దకు వచ్చి షాప్ పేరు పై లోన్ ఇప్పిస్తా అని మాయ మాటలు చెప్పి ఆమె ఒంటిపై గల అందజ మూడు తులాల బంగారు పూస్తేలతాడు ను దొంగిలించి న విషయంలో దొంగతనానికి సంబందించిన తేదీ 26.02.2025 నాడు భిక్నూర్ పోలీస్ స్టేషన్ లో అటెన్షన్ డైవర్షన్ దొంగతనం కి సంబంధించి క్రైమ్ నం. 65 /2025 యు/ఎస్ 318(2), 303(2) బి ఎన్ ఎస్ కింద కేసు నమోదయిందన్నారు.
తదుపరి విచారణను పురోగమింపజేసిన భిక్నూర్ పోలీసు అధికారులు బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాలని పరిశీలించి పలు ఆధారాలను సేకరించారు. కామారెడ్డి కామారెడ్డి ఏ ఎస్ పి, బి చైతన్యారెడ్డి పర్యవేక్షణలో భిక్నూర్ సీఐ , సిసిఎస్ ఇన్స్పెక్టర్, భిక్నూర్ ఎస్‌ఐలు సిబ్బంది తో ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగించగా, కేసుకు సంబంధించి టోల్ గెట్ వద్ద ఒకరిని, కామారెడ్డిలో ముగ్గురిని మొత్తం నలుగురుని అనుమానితులుగా నిందితులను అదుపులోకి తీసుకొని, వారు ఇచ్చిన నేరం ఒప్పుకోలు ఆధారంగా, దొంగిలించిన భిక్నూర్ కేసు కు సంబందించి కేసులో గల బంగారు పుస్తెలతాడు అందజ 03 తులాల, రెండు కార్లు, ఒక బైక్, ఈ బైక్ ముందు భాగంలో ఎం.హెచ్ 27 సిఎల్ 9425 అని, బ్యాక్ సైడ్ ఫేక్ నెంబర్ ప్లేట్ టి 27 సీఎల్ 2495, నలుగురి వద్ద నుండి మొబైల్స్ ను స్వాధీన పరుచుకున్నారన్నారు.
ఈ వ్యక్తులు పై కేసుతో పాటు ఇదే సంవత్సరం జనవరి నుండి అదిలాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలో గల పలు పోలీస్ స్టేషన్ల పరిదిలో దొంగతనాల కి పాల్పడిన ఇంకా 08 నేరాలకు సంబంధించిన వాటిని ఒప్పుకోవడం జరిగిందన్నారు. ఇవే కాకుండా ప్రదాన నిందితుడు అయిన A1: ఆఫ్తాబ్ అహ్మద్ షేక్, గతం లో తెలంగాణ రాస్ట్రం లో వివిద జిల్లాలో దాదాపు 60 వరకు దొంగతనాలు, అటెన్షన్ డైవర్షన్ దొంగతనాలకు పాల్పడినాడని, ఇట్టి విషయంలో జైల్ కు కూడా వెల్లి వచ్చినాడన్నారు. ఇట్టి దొంగ గురించి అదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్,సిద్దిపేట జిల్లాలకు సంబందించిన పోలీస్ లు గాలింపు చేపట్టిన చిక్కలేదు, ఇట్టి వ్యక్తి గురించి వివిద టీవీ చానెల్లో ప్రకటించిన ఈ దొంగ చిక్కడం లేదు అని పలు రకాల కథనాలు ప్రచురించబడినవి అన్నారు. అరెస్టు అయిన నిందితులు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన నాందేడ్ జిల్లా ముఖేడ్ మండలం సనత్ నగర్ కు చెందిన ఆఫ్తాబ్ అహ్మద్ షేక్, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన నాందేడ్ జిల్లా ఉమ్మడి మండలానికి చెందిన ఫహీమాబేగం ఫహీమ్ సయ్యద్, మూడవ ముద్దాయినటువంటి కబీరుద్దిన్ అబ్దుల్‌రహ్మాన్ షేక్ మహారాష్ట్ర నాగపూర్ పట్టణాల్లోని న్యూ శుక్రవారం మహాల్లో నివాసం ఉంటాడు.
నాలుగవ ముద్దాయి దీపక్ కిషన్ సాలుంకే మహారాష్ట్రకు చెందిన నాగపూర్ జిల్లా కేంద్రంలోని జయలక్ష్మి హౌసింగ్ సొసైటీ లో నివాసం ఉంటాడన్నారు. వీరు ఆదిలాబాద్ లో నాలుగుసార్లు, నిర్మల్ రూరల్ లో, సిద్దిపేట్, కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల్, సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మియాపూర్, నిర్మల్ టౌన్ లలో తదితరచోట్ల పలు దొంగతనాలు చేసి సుమారు 16 తులాల వరకు బంగారు నగలను అపహరించారన్నారు. ఈ కేసును ఛేదించిన విచారణాధికారి భిక్నూర్ సీఐ ఎం. సంపత్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎన్. శ్రీనివాస్, భిక్నూర్ ఎస్‌ఐ డి.ఆంజనేయులు, ఉస్మాన్ సీసీఎస్ ఎస్‌ఐ, సిబ్బంది, ఏఎస్ఐ వెంకట్రావ్, కానిస్టేబుల్ రజనీకాంత్, రాములు, కిషన్ గౌడ్, సి సి ఎస్ కానిస్టేబుల్ రవి, రాజేందర్, మైసయ్య, రమేష్ యాదవ్, మేకల నరేష్, జి.నరేష్ కుమార్ లను, వారి బృందాన్ని అభినందించడం జరిగింది అనరు. గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా ప్రజలను కోరుతున్నాం అన్నారు.
అంతరాష్ట్ర దొంగల అరెస్ట్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES