నవతెలంగాణ -తంగళ్ళపల్లి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతనంగా మదీనా మజీద్ ప్రారంభించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో దాతల సహకారంతో నూతన మదీనా మసీదును పతే అలీ ఇరానీ హైదరాబాద్ వారు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మజీద్ శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో దాతలు సుమారు 35 లక్షల వ్యయంతో నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి,గజబింకర్ రాజన్న, పడిగల రాజు, పెద్దూరి తిరుపతి, మజీద్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ఖాసిం,ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ హమీద్, హైదర్ బాబా, గౌసోద్దిన్, సలీం, ముస్తఫా, సిరిసిల్ల అధ్యక్షులు సమీ ఇమామ్, అనీఫ్ ఖాళీద్, మౌలానా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నూతన మజీద్ ప్రారంభం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES