- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ లో దోమల నివారణకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ఫాగింగ్ చేయించారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల మూలంగా దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ చేయించారు.గ్రామంలో కొంతకాలంగా దోమల బెడద ఎక్కువ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు పంచాయతీ సిబ్బందికి విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా దోమల నివారణ చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామస్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణ కోసం గ్రామంలోని అన్ని వీధుల్లో, సురేష్ నగర్ కాలనీలో గ్రామపంచాయతీ సిబ్బంది దోమల నివారణ మందును ఫాగింగ్ చేశారు.
- Advertisement -