– బాధ్యత, బాధ్యులు ఎవరు ?
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ నాళా ప్రాజెక్టును జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే గురువారం నాడు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు గేట్లను మరియు నీటి విడుదలను, సమస్యలను , ప్రాజెక్టు అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి గా నిండినప్పుడు టెక్నికల్ ప్రకారం మీకున్న విచక్షణ అధికారాలను ఉపయోగించి నీటి విడుదల చేయాలని అన్నారు, నియోజకవర్గంలోని రైతన్నలకు ముందస్తుగా సమాచారం సందేశము చాటింపులు అలర్ట్ చేయకుండా అకస్మాత్తుగా రాత్రిపూట నీటిని విడుదల చేయడం ఏంటి అని ప్రాజెక్ట్ టెక్నికల్ అధికారులకు ప్రశ్నించారు.
ఎవరి గురించో ఎదురుచూసి రైతులకు సంబంధించిన పంటలను భారీగా కోట్లాది రూపాయల నష్టం చేయడమేంటని? అందరు బాగుండాలని అందులో మీరు బాగుండాలని అన్నారు. అందరూ చేసేది రైతన్నల గురించే అని రైతు బడ్డలు ఉన్న వారందరికీ ఈ సమస్య అర్థమవుతుంది అని పేర్కొన్నారు. అపార నష్టం జరిగిన పంటలకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రాజెక్టు వాటర్ లెవల్ ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సందర్శన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే , టీఆర్ఎస్ సీనీయర్ నాయకుడు నీలు పటేల్, విట్టు పటేల్, యువ నాయకుడు వాస్రే రమేష్ , మాజీ సర్పంచులు కిషన్ పవర్, బొల్లి గంగాధర్, జుక్కల్ ఉప సర్పంచ్ భాను గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఎవరి గురించో ఎదురుచూసి రైతుల పంటలు నష్టం చేశారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES