Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలురైతు బిడ్డకు డాక్టరేట్ 

రైతు బిడ్డకు డాక్టరేట్ 

- Advertisement -

డాక్టరేట్ పొందిన మిరుదొడ్డి వాసి 
నవతెలంగాణ – మిరుదొడ్డి 

సంకల్పంతో ముందుకు  సాగితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు ఓ సాధారణ రైతు బిడ్డ.. గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ జీవితంలో ఏదైనా సాధించాలనే కృషితో ముందుకు సాగి చివరికి డాక్టరేట్ సాధించి లక్ష్యానికి చేరుకున్నాడు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన వరద రామకృష్ణయ్య- మణెమ్మల కుమారుడు వేణు చిన్ననాటి నుండి చదువుపై ఆసక్తిని కనబరుస్తూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టాను గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ నారాయణ చేతుల మీదుగా అందుకున్నాడు.

తెలుగు శాఖలో తెలుగు కవిత్వం, పర్యావరణ స్పృహ అనే అంశంపై ఆచార్య సాగి కమలాకర శర్మ పర్యవేక్షణలో పిహెచ్డి పూర్తి చేసి ఐదు సంవత్సరాల కాలానికి ఆర్థిక సహాయాన్ని అందుకున్నాడు. వేణు డాక్టరేట్ పొందడంతో తెలుగు శాఖ ఆచార్యులు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసిం, ప్రొఫెసర్ రఘు, ప్రొఫెసర్ విజయలక్ష్మి, సురవరం ప్రతాపరెడ్డి, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ నిత్యానందరావు అభినందించారు. తాను పొందిన డాక్టరేట్ పట్టాకు సహకరించిన తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, అధ్యాపకులకు వేణు కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని డాక్టరేట్ పట్టాను పొందడం గర్వంగా ఉందన్నారు. మా గ్రామానికి చెందిన వేణు ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా పొందడం సంతోషంగా ఉందని ధర్మారం గ్రామస్తులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad