Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఅనుమానాస్పందంగా వ్యవసాయ కూలి మృతి.?

అనుమానాస్పందంగా వ్యవసాయ కూలి మృతి.?

- Advertisement -

ఆలస్యంగా వెలుగులోకి.
విద్యుత్ షాకా.?.ఫిట్స్..?
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధిత కుటుంబం

నవతెలంగాణ – మల్హర్ రావు:
మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన వేల్పుల వెంకటి (38) అనే వ్యవసాయ కూలి అనుమానాస్పదంగా ఇటీవల మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అయితే విద్యుత్ షాక్ తోనే చనిపోయాని కొందరు ఆరోపించగా…లేదు పిట్స్ తోనే చనిపోయాడని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా కూలి మృతి అనుమానాస్పధంగా సంచలనంగా మారింది.
పలువురి ఆరోపణల ప్రకారం ఈనెల 13న ఇదే గ్రామానికి చెందిన నాగుల రాంరెడ్డి ఇంటి ఆవరణలో వేసిన పత్తికి మందు పిచికారీ చేయడానికి వెళ్లిన వెంకటి పిచికారీ చేస్తున్న నేపథ్యంలో పత్తి చెను చుట్టూ కోతుల బెడద కోసం వేసిన విద్యుత్ తీగ తగిలి షాక్ కు గురైనట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.షాక్ గురైన అతన్ని ప్రథమ చికిత్స చేయించి చేతులు దులుపుకున్నట్లుగా తెలిసింది.బాధితుడు తనకు విద్యుత్ షాక్ తగిలి శరీరంపై గాయాలైన పరిస్థితిని తన కుమారుడు లక్ష్మన్ కు ఇక చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు వివరించ్చినట్లుగా తెలుస్తోంది.అయితే ఈ నెల 17న బాధితుడు అనుమానస్పదంతో మృతి చెందడం ద్వారా కుటుంబ సభ్యులు ఆందోళన గురైయ్యారు. పలువురు ఆరోపణల మేరకు మందు పిచికారికి పిలిచిన రైతు వద్దకు గ్రామంలో పలువురు పెద్ద మనుషులను తీసుకొని వెళ్లి అడగగా మొదట మా కొడుకు వచ్చాక మాట్లాడుతామని,మరుసటి రోజు మాకు సంబంధం లేదు,అతను ఎవరో తెలియదని భూకయించినట్లుగా తెలిసింది.బాధిత కుటుంబం న్యాయం కోసం కొయ్యుర్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి పిర్యాదు చేసినట్లుగా తెలిసింది.

ఈ విషయంపై రాంరెడ్డి కుమారుడు రాజును నవ తెలంగాణ వివరణ కోరగా వెంకటి ఎవరో తనకు తెలియదని,విద్యుత్ షాక్ కాదు ఫిట్స్ తో చనిపోయినట్లుగా తెలుస్తోందన్నారు.ఇదే విషయంపై మృతుని కుటుంబ సభ్యులను వివరణ కోరగా విద్యుత్ షాక్ తోనే తన భర్త మొదట ఫిట్స్ ద్వారా చనిపోయాడని అనుకున్నామని గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం విద్యుత్ షాక్ తోనే చనిపోయడనే అనుమానంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లుగా తెలిపింది.
ఈ విదయంపై కొయ్యుర్ ప్రొపెషన్ ఎస్ఐ రాజన్ కుమార్ ను వివరణ కోరగా వేల్పుల రాజేశ్వరి అనే మహిళ తన భర్త విద్యుత్ షాక్ తో చనిపోయినట్లుగా అనుమానం ఉందని పిర్యాదు చేసింది నిజమేని,కేసు నమోదు చేసి, విచారణ చేస్తామన్నారు.
ఇదే విద్యుత్ తిగకు ఈ నెల 3న ఓదెల‌ సులోచన అనే మహిళకు సైతం విద్యుత్ షాక్ కు గురైనట్లుగా తెలుస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad