– మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే.. :మంత్రి కేటీఆర్
– జీవో 118 కింద పట్టాల పంపిణీ
నవతెలంగాణ-వనస్థలిపురం
ఆగస్టు 15 నుంచి డబుల్ బెడ్‌రూమ్స్ పంపిణీ మొదలెట్టి అక్టోబర్‌లోగా లక్ష ఇండ్ల పంపిణీ పూర్తి చేస్తామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అత్యంత ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. హైదరాబాద్ ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో జీవో నెం.118 కింద రెగ్యుల రైజ్ చేసి పట్టాలను బుధ వారం వనస్థలిపురం జీఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ సమస్యను 118 జీవోతో పరిష్కరించినట్టు తెలిపారు.
ఇందులో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కృషి చాలా ఉందని చెప్పారు. దీని వల్ల 18 వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇండ్లు ఇస్తామన్న హామీని నెరవేర్చుకుంటాపోతుంటే.. పనీ పాట లేని కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆగస్టు 15 నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీని ప్రారంభిస్తా మని, అక్టోబర్‌లోపు లక్ష ఇండ్ల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయ న్నారు. సంక్షేమ కార్యక్రమాలే కాకుం డా, శాశ్వత సమస్యల పరిష్కారంపై ముందుకు సాగుతున్నామన్నారు. కరోనా అనంతరం ప్రతి ప్రాంతంలో అత్యాధునిక ఆస్పత్రుల నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాయకులు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే.. వారిని ప్రజలు వదులుకోరని, రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాచకొండ సీపీడీిఎస్ చౌహన్, బీఆర్‌ఎస్ నాయకులు క్యామ మల్లేష్, అమరవాది లక్ష్మీనారాయణ, జీహెచ్ ఎంసీ కమిషనర్, సుష్మ, గజ్జల మధు సూదన్ రెడ్డి, బీఆర్‌ఎస్ వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి డివిజన్ల అధ్యక్షులు చింతల రవికుమార్ గుప్తా, కటికరెడ్డి అరవింద్ రెడ్డి, డీసీపీ సాయిశ్రీ, వనస్థలిపురం ఏఏపీ భీమ్ రెడ్డి, వనస్థలిపురం సీఐ జలంధర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.