Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఅస్మదీయుడికి అడ్డగోలుగా!

అస్మదీయుడికి అడ్డగోలుగా!

- Advertisement -

– కుటుంబ క్లబ్‌లో ఆఫీస్‌బేరర్‌గా పని చేసిన వ్యక్తికి సీఈవో పదవి
– హెచ్‌సీఏ తాత్కాలిక ఉపాధ్యక్షుడు దల్జీత్‌ సింగ్‌ నిర్వాకం

జెండర్‌ టెస్టుకు సై
ఒలింపిక్‌ చాంపియన్‌, తైవాన్‌ బాక్సర్‌ లిన్‌ యు టింగ్‌ లింగ పరీక్షకు సిద్ధమైంది. వరల్డ్‌ బాక్సింగ్‌ (డబ్ల్యూబి) రూల్స్‌ ప్రకారం మహిళల విభాగంలో పోటీపడే అథ్లెట్లు తప్పనిసరిగా లింగ పరీక్ష ఫలితాలు సమర్పించాలి. 18 ఏండ్లు నిండిన అథ్లెట్లకు మాత్రమే ఈ పరీక్ష చేయనుండగా.. ఈ టెస్టులో పుట్టిన సమయంలో జెండర్‌ వివరాలు తెలుస్తాయి.

నవతెలంగాణ – హైదరాబాద్‌
ఓ వైపు నిబంధనలు పాటించని కారణంతో సహచర హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఆఫీస్‌ బేరర్లు సిఐడి కేసుల్లో జైలు పాలుకాగా… తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సర్దార్‌ దల్జీత్‌ సింగ్‌ రూల్స్‌ను ఉల్లంఘించేందుకు రెట్టించిన ఉత్సాహం కనబరుస్తున్నాడు. రూల్స్‌ విరుద్ధంగా వార్షిక సర్వ సభ్య సమావేశం (వాయిదా) నిర్వహణ, 57 క్లబ్‌లపై మళ్లీ నిషేధం విధించటంలో దల్జీత్‌ సింగ్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. హెచ్‌సీఏ వ్యవహారాల పర్యవేక్షణకు హైకోర్టు ఏకసభ్య కమిటీని నియమించినా.. అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం పేరిట సర్దార్‌ దల్జీత్‌ సింగ్‌ అడ్డదారుల్లో అస్మదీయులను అందలం ఎక్కిస్తున్నాడు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సీఈవో (ముఖ్య కార్యనిర్వహణ అధికారి) కోసం ఓ వైపు ఇంటర్వ్యూలు జరుగుతుండగా.. మరోవైపు ఇంతియాజ్‌ ఖాన్‌ను తాత్కాలిక సీఈవోగా నియమిస్తూ దల్జీత్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశాడు. బహుళజతి సంస్థల్లో పని చేసిన అనుభవానికి తోడు స్వతహాగా క్రికెటర్‌ కావటం ఇంతియాజ్‌ ఖాన్‌ ఎంపికకు కారణమని పత్రిక ప్రకటనలో దల్జీత్‌ సింగ్‌ కొనియాడారు. కానీ ఇంతియాజ్‌ ఖాన్‌ తన కుటుంబ క్రికెట్‌ క్లబ్‌లకు ఆఫీస్‌ బేరర్‌గా పని చేసిన విషయాన్ని మాత్రం దల్జీత్‌ సింగ్‌ దాచిపెట్టారు. దీంతో హెచ్‌సీఏ క్లబ్‌ కార్యదర్శులు ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బహుళ క్లబ్‌ యాజమాన్య ప్రయోజనాల కింద ఇటీవల 57 క్లబ్‌లు ఏజీఎంకు హాజరు కాకుండా నిషేధం విధించిన దల్జీత్‌ సింగ్‌.. స్వయంగా అవే ఆరోపణలు ఎదుర్కొవటం గమనార్హం. అమీర్‌పేట్‌ క్రికెట్‌ క్లబ్‌, ఖాల్సా క్రికెట్‌ క్లబ్‌లు దశాబ్దాలుగా దల్జీత్‌ సింగ్‌ కుటుంబ ఆధీనంలో ఉన్నాయి. ఈ రెండు క్లబ్‌ల లావాదేవీలను దల్జీత్‌ సింగ్‌ పర్యవేక్షించినట్టు హెచ్‌సీఏ రికార్డుల్లో స్పష్టంగా ఉంది. తాజాగా తాత్కాలిక సీఈవోగా ఎంపికైన ఇంతియాజ్‌ ఖాన్‌ ఈ రెండు క్లబ్‌లకు జాయింట్‌ సెక్రటరీగా పని చేశారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా హెచ్‌సీఏ మాజీ కార్యవర్గ సభ్యుడు చిట్టి శ్రీధర్‌ బయటపెట్టారు. బీసీసీఐ, హెచ్‌సీఏ రాజ్యాంగం ప్రకారం ఆఫీస్‌ బేరర్లు ఎటువంటి విరుద్ధ ప్రయోజనాలు పొందకూడదు. విరుద్ధ ప్రయోజనాలు పొందితే.. సదరు ఆఫీస్‌ బేరర్‌ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. దల్జీత్‌ సింగ్‌ కుటుంబ క్రికెట్‌ క్లబ్‌లకు ఆఫీస్‌ బేరర్‌గా పనిచేసిన ఇంతియాజ్‌ ఖాన్‌ను సీఈవోగా నియమించటం అక్రమమని, ఇది చెల్లుబాటు కాదని చిట్టి శ్రీధర్‌ ఆరోపించారు.

హెచ్‌సీఏ రూల్స్‌ ప్రకారం ఓ వ్యక్తికి రెండు క్రికెట్‌ క్లబ్‌లు ఉండకూడదు. దల్జీత్‌ సింగ్‌కు రెండు క్రికెట్‌ క్లబ్‌లు ఉన్నాయి. ఆ రెండు క్లబ్‌ల తరఫున పోటీ చేసిన వ్యక్తులు ఆఫీస్‌బేరర్లుగా ఎన్నికయ్యారు. ఇది ఎన్నికల్లో అనుచిత లబ్ది కిందకు వస్తుంది. తాజాగా ఆ రెండు క్లబ్‌ల తరఫున ఆఫీస్‌బేరర్‌గా పని చేసిన వ్యక్తిని సీఈవోగా నియమించారు. దల్జీత్‌ సింగ్‌ కుటుంబం ఆధీనంలోని అమీర్‌పేట్‌, ఖాల్సా క్రికెట్‌ క్లబ్‌ల నుంచి హెచ్‌సీఏలో ఇప్పుడు ఇద్దరు ఆఫీస్‌ బేరర్లు సహా ఓ సీఈవో ఉన్నారంటే…ఇది ఏ స్థాయి నిబంధనల ఉల్లంఘనో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై త్వరలోనే ఫిర్యాదు చేస్తాను’
– చిట్టి శ్రీధర్‌,
హెచ్‌సీఏ మాజీ కార్యవర్గ సభ్యుడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad