- Advertisement -
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ రోజు రోజుకు అగాథంలోకి పడిపోతోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం అనిశ్చితికి తోడు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ మరింత ఒత్తిడికి గురి అవుతోంది. గురువారం ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు క్షీణించి 87.25కు దిగజారింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజీలో డాలర్‌తో రూపాయి విలువ 87.04 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 87.27 కనిష్టాన్ని తాకింది. ముడి చమురు బ్యారెల్ ధర 0.90 శాతం శాతం పెరిగి 67.44 వద్ద ముగిసింది.
- Advertisement -