Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంస్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్రకు గుర్తింపు రాలే..

స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్రకు గుర్తింపు రాలే..

- Advertisement -

– ఆవాజ్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రెటరీ మహమ్మద్‌ అబ్బాస్‌
– పాతబస్తీ ఉర్దూగర్‌లో స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లింల పాత్రపై సదస్సు

నవతెలంగాణ – సిటీబ్యూరో
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లింల పాత్రకు చరిత్రలో తగిన గుర్తింపు రాలేదని ఆవాజ్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ మహమ్మద్‌ అబ్బాస్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ పాతబస్తీలోని ఉర్దూగర్‌లో ఆవాజ్‌ ఆధ్వర్యంలో గురువారం ‘స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లింల పాత్ర’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 80 ఏండ్లు కావస్తున్నా ఆ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ముస్లింల పాత్రకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 15న ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధాని మోడీ.. స్వాతంత్య్ర ఉద్యమకారుల పేర్లు గుర్తు చేసుకోకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు దేశభక్తులని కొనియాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు బోల్వాల్కర్‌ ”స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనకండి.. అలా పాల్గొని సమయం వృథా చేసుకోకండి” అని అన్నారని గుర్తు చేశారు.

అంతేకాకుండా బ్రిటిష్‌ వారికి వారు పోరాడకుండా చేస్తామని ఉత్తరాలు రాసేవాడని చెప్పారు. టిప్పు సుల్తాన్‌ బ్రిటిష్‌ వారికి ఎదురొడ్డి ప్రాణాలను అర్పించారని, అలాంటివారి సమాధి లేకుండా చేయాలని ప్రస్తుత ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఆస్పతుల్లా ఖాన్‌ బ్రిటిష్‌ వారికి ఎదురొడ్డి పోరాడి పట్టుబడ్డారని, అతనికి మరణశిక్ష విధించారని చెప్పారు. తన చివరి కోరికగా ఏమని అడగ్గా.. భారతమాత గుప్పెడు మట్టిని తన వడిలో పెట్టి, తనను ఖననం చేయాలని కోరారని గుర్తు చేశారు. అది ముస్లింల దేశభక్తి అని అన్నారు. 1920లో మౌలానాలు కూడా సంపూర్ణ స్వాతంత్య్రం కోసం ముస్లింలు ప్రాణాలకు తెగించి పోరాడాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం ముస్లింలను సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురిచేసే విధానాలు అమలవుతున్నాయని, బీహార్‌లో బర్త్‌ సర్టిఫికెట్‌ లేదని 35 లక్షల ఓట్లను తీసేశారని, అవి పూర్తిగా ముస్లింల ఓట్లేనని చెప్పారు. ఈ కొత్త రకం నిబంధనలను అన్ని రాష్ట్రాలకూ విస్తరిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రిక్షావాడు, ఆటోవాడు, టాక్సీ డ్రైవర్‌, కార్మికులు, కూరగాయల వ్యాపారులందరూ ముస్లింలేనని, వీరికి గృహాలు, సదుపాయాలు లేవన్నారు. ఈ పరిస్థితిని మార్చాలంటే ఐక్యంగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు.

మైనారిటీ కార్పొరేషన్‌ ఫైనాన్స్‌ మాజీ డైరెక్టర్‌ ఎంఏ సిద్ధికి మాట్లాడుతూ.. విద్యే కుటుంబానికి, పట్టణానికి, రాష్ట్రానికి అభివృద్ధికి మూలం అని, నిరక్షరాస్యతే వెనుకబాటుకు కారణం అని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో మైనారిటీలకు ఇండ్లు, ప్లాట్లు, రైతులకు ఆర్థిక సాయం అందించామని చెప్పారు. ఓటు హక్కు ద్వారా దేశ అభివృద్ధికి కృషి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గెలాక్సీ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ చైర్మెన్‌ షేక్‌ హుస్సైమీ ఉద్దీన్‌, సలహాదారు ఆబేద్‌ హుస్సేన్‌, సీనియర్‌ సోషల్‌ వర్కర్‌ మనసూర్‌ రెహమాన్‌, సోషల్‌ వర్కర్‌ మునిరుద్దీన్‌ ముజాహిద్‌, ఆవాజ్‌ సిటీ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ మెహబూబా అలీ, జనరల్‌ సెక్రెటరీ అబ్దుల్‌ సత్తార్‌తోపాటు చార్మినార్‌ జోన్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad