Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు ఆమోదం

ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు ఆమోదం

- Advertisement -

– ఎలాంటి చర్చలేకుండానే రాజ్యసభలో పాస్‌
– అన్ని రకాల మనీ గేమ్స్‌పై నిషేధం

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు-2025 పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. రాజ్యసభలో గురువారం ఆ బిల్లుకు ఆమోదం లభించింది. విపక్షాల తీవ్ర ఆందోళన నడమే బిల్లును పాస్‌ చేశారు. ఎటువంటి చర్చ లేకుండానే బిల్లుకు పచ్చజెండా ఊపారు. కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్‌లో జరిగే అన్ని రకాల మనీ గేమ్స్‌ను నిషేధిస్తూ ఈ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లు ద్వారా ఈస్పోర్ట్స్‌, ఆన్‌లైన్‌ సోషల్‌ గేమింగ్‌ను మాత్రం ప్రమోట్‌ చేస్తున్నారు. విపక్ష సభ్యులు ఇచ్చిన సవరణలను తోసిపుచ్చుతూ.. ఇవాళ రాజ్యసభలో ఆ బిల్లుకు ఆమోదం దక్కింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు బుధవారం లోక్‌సభలో క్లియరెన్స్‌ దక్కిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌, బ్యార్‌ బ్యాంక్స్‌, ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన వాణిజ్య ప్రకటనపై కూడా నిషేధం విధించారు. డబ్బులు డిపాజిట్‌ చేసి ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ ఆడే విషయం తెలిసిందే. గెలిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో ఈ క్రీడల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad