Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఒంటరిగానే పోటీ చేస్తాం

ఒంటరిగానే పోటీ చేస్తాం

- Advertisement -

– బీజేపీ భావజాల శత్రువు.. డీఎంకే రాజకీయ ప్రత్యర్థి
– ఆ పార్టీలతో పొత్తు ఉండదు : తమిళ వెట్రి కళగం అధినేత విజరు స్పష్టీకరణ
– మదురైలో పార్టీ రెండో రాష్ట్రస్థాయి సమావేశం
– 2026 తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేతోనే పోటీ అని వెల్లడి
చెన్నై :
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు విజరు తెలిపారు. గురువారం టీవీకే పార్టీ రెండో రాష్ట్రస్థాయి సమావేశం మదురైలో జరిగిం ది. ఈ సమావేశానికి ఆయన అభిమానులు, పార్టీ కార్యక ర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఎన్నికల్లో పొత్తులపై స్పష్టతనివ్వటమే కాకుండా పలు అంశాలు, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను లేవనెత్తారు.

సింహం సింగిల్‌గా..
ఈ కార్యక్రమంలో అక్కడకు వచ్చినవారిని ఆకట్టుకునేలా ఆయన ప్రసంగం సాగింది. ”మా ఏకైక భావజాల శత్రువు బీజేపీ, మా రాజకీయ శత్రువు డీఎంకే. ఈ రెండు పార్టీలతో పొత్తు ఉండదు. టీవీకే ఒంటరిగా నిలబడుతుంది. ఎవరికీ భయపడదు” అని ఆయన స్పష్టం చేశారు. అడవిలో నక్కలు ఎన్ని ఉన్నా, సింహం ఒక్కటే రాజు అనీ, దాని గర్జన చాలా దూరం వరకూ వినిపిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో సింహం ఎప్పుడూ సింహమే అంటూ సమావేశంలో జనాలను ఉత్తేజపరిచారు. ఈ క్రమంలో 2026 తమిళనాడు రాజకీయాల్లో తమ పార్టీ టీవీకే, డీఎంకే మధ్య పోటీ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘తమిళనాడు గుండె చప్పుడు మాత్రమే వింటా’
విజరు తన ప్రసంగంలో మదురై గొప్పతనాన్ని చెప్పారు. అలంగనల్లూర్‌ జల్లికట్టు, మీనాక్షి అమ్మన్‌ ఆలయం ఇవన్నీ తమిళ ప్రజల ధైర్యం, సంప్రదాయాలకు చిహ్నాలని గుర్తు చేశారు. 1967, 1977లో తమిళనాడు రాజకీయాల్లో జరిగిన చారిత్రక మార్పులను గుర్తు చేస్తూ, 2026లో అలాంటి మరో మార్పునకు తాను నాయకత్వం వహిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ”నేను రాజకీయాల్లోకి రానన్నారు, ఓట్లు వేయరన్నారు. కానీ నేను తమిళనాడు గుండె చప్పుడు మాత్రమే వింటాననీ, మిగతా విమర్శలను చూసి నవ్వుతాను” అంటూ ఆయనపై ప్రత్యర్థులు, విమర్శకులు చేస్తున్న కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు.

పలు అంశాల ప్రస్తావన
విజరు తన ప్రసంగంలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. తమిళ జాలర్ల సమస్యలు, కచ్చతీవు తిరిగి తీసుకోవాలనే డిమాండ్‌, నీట్‌ రద్దు చేయాలనే అంశాలను ఆయన లేవనెత్తారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి టీవీకే గట్టిగా పోరాడుతుందని హామీ ఇచ్చారు. విజరు తనను తాను సింహంతో పోల్చుకున్నారు. టీవీకే ఎవరి మద్దతు లేకుండానే తమిళనాడు రాజకీయాల్లో స్థానం సంపాదిస్తుందన్నారు. కాగా విజరు చేసిన ప్రసంగానికి సంబంధించిన కామెంట్లు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad