నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్యులు మరో మైలురాయిని అధిగమించారు. హైదరాబాద్ నాంపల్లి నివాసి కె.సుందరరావు అనే 77 ఏళ్ల వృద్ధుడికి ఛాతీపై కోత లేకుండానే, మొట్టమొదటి లీడ్‌లెస్ పేస్‌మేకర్‌ను విజయవంతంగా అమర్చారు. పూర్తి హార్ట్‌బ్లాక్‌తో బాధపడుతున్న వృద్ధుడు సంప్రదాయ పద్ధతిలో శస్త్రచికిత్సకు భయపడడంతో నిమ్స్ కార్డియాలజీ బృందం ఈ అత్యాధునిక లీడ్‌లెస్ పేస్‌మేకర్‌ను అమర్చాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో, చిన్నపాటి స్వీయ నియంత్రణ యూనిట్ అయిన పేస్‌మేకర్‌ను తొడ సిర ద్వారా నేరుగా గుండెలోకి పంపించారు. సంప్రదాయ పేస్‌మేకర్లకు అవసరమైన లీడ్‌లు, ఛాతీపై చేసే శస్త్రచికిత్స వంటివి ఈ పద్ధతిలో అవసరం లేదు. దీంతో రోగికి తక్కువ సమస్యలు ఉంటాయనీ, కోలుకోవడం కూడా వేగంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. గుండెపై శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఇష్టపడని వారికి ఆట్రియల్ పేసింగ్ అవసరం లేని వారికి ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని వారు వివరించారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను డాక్టర్ ఎన్ రామకుమారి (కార్డియాలజీ విభాగాధిపతి), డాక్టర్ న్యూషా దొడ్డి, డాక్టర్ ఉమాదేవి కరూరు, డాక్టర్ ఐ.సదానంద్, డాక్టర్ మెహరున్నీసా సయ్యద్‌లతో కూడిన కార్డియాలజీ బృందం విజయవంతంగా నిర్వహించింది. ఈ బృందానికి టెక్నీషియన్లు, నర్సులు, సహాయక సిబ్బంది సహకరించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప వైద్య బృందానికి అభినందనలు తెలిపారు. ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో రూ.2 లక్షలకుపైగా ఖర్చయ్యే శస్త్రచికిత్సను రూ.60 వేల హ్యాండ్లింగ్ చార్జెస్‌తో విజయవంతగా పూర్తి చేసినట్టు తెలిపారు.
నిమ్స్‌లో తొలిసారి వృద్ధుడికి లీడ్‌లెస్ పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES