నవతెలంగాణ-మంగపేట
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వమని మండల పార్టీ అద్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రం వైఎస్ఆర్ సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, కెటీఆర్ల ప్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రైతాంగం సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని రైతులకిచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశారని అన్నారు. 17 వేల 351 కోట్ల రుణాలు మాఫీ చేయగా ప్రస్తుతం 29.61 లక్షల రైతు కుటుంబాలకు మరో 19 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా సభ్యులు పచ్చా శేషగిరిరావు, ఉప్పుటూరు లలితమ్మ, మల్లూరు దేవస్థానం చైర్మన్ నూతులకంటి ముకుందం, మాజీ జడ్పీటీసీ సిద్ధంశెట్టి వైకుంఠం, మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య, మండవ రామకృష్ణ, కోదండం, దాబా ప్రసాద్, అయూబ్, భుట్టో, వీరస్వామి, రమేష్ లు తదితరులు పాల్గొన్నారు.