నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని చద్మాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని నౌశిరామ్ తండా లో ఎల్లారెడ్డి డివిజన్ సబ్ యూనిట్ అధికారి పాశం గోవిందరెడ్డి, డివిజన్ సామాజిక ఆరోగ్య అధికారి జి. ఠాగూర్ గారల ఆధ్వర్యంలో దోమల యొక్క లార్వా, దోమల నివారణ చర్యలు, దోమలు పుట్టకుండా-దోమలు కుట్టకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డివిజనల్ ఆరోగ్య అధికారులు మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా ప్రజలు తమ ఇంటి చుట్టూ పరిసర ప్రాంతంలో శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి పరిసర ప్రాంతాలలో పాత ఇనుప సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు, కొబ్బరి చిప్పలు, వాడి పాడేసిన కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ గ్లాసులు, పాత రుబ్బు రోళ్లు, పాత టైర్లు ఇవన్నీ దోమలకు ఉత్పత్తికి ప్రధాన స్థావరాలు. వర్షాకాలం కారణంగా ఈ వస్తువులలో వర్షము నీరు నిలువ ఉండి దోమలకు ఉత్పత్తి స్థావరాలుగా మారుతాయి.
కావున ప్రజలు తమ పరిసర ప్రాంతములలో పనికిరాని వస్తువు లన్నింటిని తొలగించవలసినదిగా అదే విధంగా రోజు వాడుకునే నీటి డ్రమ్ములు కుళ్లాయిలు, సిమెంట్ తొట్టీలు వారానికి రెండు పర్యాయములు శుభ్రంగా కడుక్కొని, రెండు మూడు గంటలు ఆరబెట్టి తిరిగి నీళ్లు నింపుకొని వాటిపైన మూతలు పెట్టవలసినదిగా కోరుచున్నాము. మూతలు పెట్టిన యెడల దోమలు గుడ్లు పెట్టడానికి అవకాశం ఉండదు. దోమలు పుట్టకుండా-దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవలెను. దోమలు కుట్టకుండా శరీరము నిండా దుస్తులు ధరించవలయును. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండవలయును. దోమల నివారణకు ఆల్ అవుట్, వేపాకు పొగ మరియు ఇతర నివారణ సాధనాల ద్వారా దోమలు కుట్టకుండా చేసుకోవలెను. అదేవిధంగా ఈ సీజన్ లో ఫ్రిజ్ లో పెట్టిన చల్లని ఆహార పదార్థాలు బుజించరాదు. ఎప్పటికప్పుడు వేడి ఆహార పదార్థాలు భుజించవలెను.
కాచి చల్లార్చిన నీటిని సేవించవలెను. గ్రామములో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చిన ఎడల వెంటనే స్థానిక ఆరోగ్య కార్యకర్తలు సావిత్రి, నిర్మల ఎమ్.ఎల్.హెచ్.పి. లేదా ఆశ కార్యకర్తలను సంప్రదించవలసినదిగా విజ్ఞప్తి చేయుచున్నాము.ప్రతిఒక్కరూ అందు బాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సేవలు పొంది, ప్రైవేటు ఆసుపత్రులలో అనవసరమైన వైద్య ఖర్చులు పెట్టుకొని అనారోగ్యం పాలు కావద్దని సూచించారుఈ కార్యక్రమములో ఆరోగ్య పర్యవేక్షకురాలు సునంద, స్థానిక ఆరోగ్య కార్యకర్తలు సావిత్రి, నిర్మల, పంచాయతీ కార్యదర్శి గోదావరి, అమ్మీనా, సావిత్రి, లలిత ఆశ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES