పీఆర్సీని వెంటనే అమలు చేయాలి..
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్
నవతెలంగాణ – మిరుదొడ్డి
ఈ నెల 23 తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిరుదొడ్డిలో మధ్యాహ్న భోజన సమయంలో ఉపాధ్యాయ సంఘాలు పోరాట కమిటీ మహాధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు . ఈ సందర్భంగా టి పి టి ఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి .తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షులు అందె రామచంద్రం లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగ ,ఉపాధ్యాయులకు పిఆర్సి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు.పిఆర్సి నివేదికను వెలువరించి జూలై 2023 నుండి వెంటనే పిఆర్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటిచి, అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాల అన్నారు.
5571 PS హెచ్ఎం పోస్టులు ప్రకటించి, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింప చేయాలనారు. జీవో నెంబర్ 25 ను సవరించాలి, ప్రతి ప్రైమరీ స్కూల్లో ఇద్దరు టీచర్లు, 40 మంది పిల్లలు దాటితే 5 మంది టీచర్లు ఉండేలాగా పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 5 డి ఏ లలో కనీసం 2 ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ సిపిఎస్ రద్దు ,పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల టైం టేబుల్ మార్చాచి కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనం ఇవ్వాలనారు. బేసిక్ పే ప్రకటించాలి, మోడల్ స్కూల్ టీచర్ 010 హెడ్ కింద జీతాలు ఇవ్వాలని కోరారు.
అనంతరం టి పి టి ఎఫ్ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా మిరుదొడ్డి మండలం లోని వివిధ గ్రామాల ప్రాథమిక పాఠశాల,ప్రాథమిక ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులచే సభ్యత్వం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దాసరి యాదగిరి, రాష్ట్ర కౌన్సిలర్ జి .జానకి రాములు జిల్లా ఉపాధ్యక్షులు ర్యాకం మల్లేశం, జిల్లా కార్యదర్శి గూడూరి శివాజీ, జిల్లా కౌన్సిలర్స్ గడ్డమీది శ్రీనాథ్, ఎం విజయ్ కుమార్, కడవేర్గు సురేష్ కుమార్, శ్రీకాంత్ రావ్, హరి ప్రసాద్, MD. గౌస్ మియా, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
23న చలో హైద్రాబాద్ విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES