Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పీఆర్టీయు మహాధర్నా విజయవంతం చేయండి    

పీఆర్టీయు మహాధర్నా విజయవంతం చేయండి    

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
కాంట్రిబ్యూటరీ పెన్షన్,సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ పెన్షన్ విగ్రహ దినమైన సెప్టెంబర్ 1 తేదీన తెలంగాణ పీఆర్టీయూ  సంఘ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇంద్ర పార్క్ వద్ద మహాధర్న నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వడిత్య వెంకట్రామ్ నాయక్ కోరారు, శుక్రవారం  ధర్నాకు సంబంధించిన పోస్టర్ను మండల కేంద్రం లో ఆవిష్కరించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలనిఅన్నారు.

కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57, 58 ల ప్రకారం 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఈ మాహ ధర్నాకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో హైదరాబాదులోని ఇంద్ర పార్క్ వద్ద పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బూరుగు రామ్మూర్తి, షేక్ మెహజాబీ, గులాం అంజాద్, మహమ్మద్ అంజూమ్, కంపెల్లి ధర్మారెడ్డి, పున్న అనిత పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad