నవతెలంగాణ – రెంజల్
మండలంలోని కందకుర్తి, అంబేద్కర్ నగర్ గ్రామాలలో మంజూరైన అంగన్వాడి కేంద్రాలను మండల ప్రత్యేక అధికారి, డి ఎల్ పి ఓ నాగరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ లు ప్రారంభించారు. ఒక్కొక్క భవనానికి 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఇట్టి నిధులు ఎన్ఆర్ఈజీఎస్, ఉమెన్స్ చైల్డ్ వెల్ఫర్ సొసైటీ, 15 ఫైనాన్స్ ద్వారా ఖర్చు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కమలాకర్, ఎంపీవో రఫీ హైమద్, ఇన్చార్జి టీ వెంకటేశ్వర్ లు నాయకులు జావేద్ ఉద్దీన్, ధనుంజయ్, గియాసోద్దీన్, ఓ మోహన్, అంజయ్య అవేస్, మాజీ సర్పంచ్ కలీం బేగ్, సిరాజ్, పూర్ఖాన్, రాము తదితరులు పాల్గొన్నారు.
పశువుల పాక ప్రారంభం..
మండలంలోని తాడు బిలోలి గ్రామంలో పశువుల పాపను కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు జి .సాయి రెడ్డి, మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ లు ప్రారంభించారు. ఎన్ ఆర్ ఈజీఎస్ కింద 80 లక్షల రూపాయల వ్యయంతో గ్రామంలో నాలుగు పశువులపాకలకు నిధులు కేటాయించి నట్లు వారు పేర్కొన్నారు. పురం లక్ష్మణ్ కు సంబంధించిన పశువులపాకను శుక్రవారం అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి, సాయిబాబా గౌడ్, అంజయ్య, జావిద్ ఉద్దీన్, ధనుంజయ్, మోహన్ ఎంపీడీవో వి కమలాకర్, ఏపీవో రమణ, స్థానిక నాయకులు పురం నరసయ్య, క్షేత్ర సహాయకులు మధు, యోగేష్, క్రాంతి కుమార్, సురేష్, బాబా, తదితరులు పాల్గొన్నారు.
